వరల్డ్ వైడ్ ‘మహావతార్ నరసింహ’కి ఇప్పటివరకు భారీ వసూళ్లు..!

వరల్డ్ వైడ్ ‘మహావతార్ నరసింహ’కి ఇప్పటివరకు భారీ వసూళ్లు..!

Published on Aug 2, 2025 3:00 AM IST

రీసెంట్ గా కన్నడ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన యానిమేషన్ చిత్రమే “మహావతార్ నరసింహ”. ఎలాంటి స్టార్ నటుల ప్రెజెన్స్ లేకపోయినప్పటికీ డివోషనల్ చిత్రం ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ మన్ననలు పొంది భారీ రన్ ని అందుకుంది. గత వారం రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు వారం రోజుల రన్ ని పూర్తి చేసుకున్నప్పటికీ అదే ఫామ్ ని కొనసాగిస్తుంది.

కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ స్ట్రాంగ్ బుకింగ్స్ ని డామినేషన్ గా చూపిస్తూ ఫైనల్ గా ఈ వారంలో భారీ వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. కేవలం ఇండియా వరకే మహావతార్ నరసింహ ఏకంగా 53 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.

ఇది మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఇందులో మేజర్ గా హిందీ, తెలుగు వెర్షన్ లే కీలక పాత్ర పోషించడం మరో కీలక అంశం. ఇక ఇదే ఫామ్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఫైనల్ రన్ లో ఈ సినిమా 100 కోట్లు కొట్టినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

తాజా వార్తలు