క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్

క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్

Published on Jul 29, 2025 8:37 PM IST

మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ఇలానే చాలానే టాగ్స్ ఉండొచ్చు కానీ డార్లింగ్ అంటే టాగ్ మాత్రం బుజ్జిగాడు సినిమా నుంచి ఏ లెవెల్లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ప్రభాస్ తో పూరి జగన్నాథ్ ప్రయాణం ఒకింత స్పెషలే అని చెప్పవచ్చు.

అయితే ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ కెమెరా కంటికి ఓకే ఫ్రేమ్ లో కనిపించడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ భారీ చిత్రం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ సెట్స్ లో పూరి ఇంకా ఛార్మిలు సందడి చేయడం జరిగింది. దీనితో ఇక్కడ పూరిని గట్టిగా హగ్ చేసుకున్న డార్లింగ్ పిక్స్ చూస్తే తమ బాండింగ్ ఏ లెవెల్ అనేది మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక దీనితో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారిపోయాయి. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు