సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్న బ్యూటీ శ్రుతి హాసన్. తనకు నచ్చిన పాత్రలను చేస్తూ దూసుకెళ్తోంది ఈ భామ. అయితే, ఆమె రీసెంట్‌గా చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి. దీంతో శ్రుతి క్రేజ్ మరోసారి జోరందుకుంది.
ఇక ఈ బ్యూటీ ఇప్పుడు రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి హాసన్ తన డ్రీమ్ రోల్ ఏమిటనేది వెల్లడించింది. తాను ఎప్పటికైనా ఓ మ్యుజిషియన్ పాత్రలో నటించాలనేది తన కోరిక అని ఆమె చెప్పుకొచ్చింది.
సంగీతం కోసం పరితపించే దర్శకురాలిగా స్క్రీన్‌పై తనను తాను చూసుకోవాలని ఎప్పటినుంచో ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మరి శ్రుతి కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో చూడాలి.