‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?

‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?

Published on Jul 28, 2025 7:00 AM IST

Kingdom

సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాతో విజయ్ మంచి బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే దీనికి ముందు వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదు.

అయినప్పటికీ కింగ్డమ్ కి భారీ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇలా వరల్డ్ వైడ్ గా కింగ్డమ్ కి 50 కోట్లకి పైగానే థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూలు చేయాల్సి ఉందని చెప్పాలి. అయితే ఓపెనింగ్స్ పరంగా మంచు నంబర్స్ ఈ చిత్రం నమోదు చేస్తుంది అని ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. మరి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు