సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కింగ్డమ్”. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి అవైటెడ్ ట్రైలర్ కట్ నేడు విడుదల కాబోతుండగా ఈ గ్యాప్ లోనే మేకర్స్ సినిమా సెన్సార్ అప్డేట్ కూడా ఇచ్చేసారు.
దీనితో కింగ్డమ్ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. సో ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ తన కింగ్డమ్ ఇంకా బాక్సాఫీస్ ని టేకోవర్ చేయడమే మిగిలి ఉందని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఈ జూలై 31న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి రాబోతుంది.