వరల్డ్ వైడ్ ‘హరిహర వీరమల్లు’ డే 1 కలెక్షన్ ప్రిడిక్షన్!

వరల్డ్ వైడ్ ‘హరిహర వీరమల్లు’ డే 1 కలెక్షన్ ప్రిడిక్షన్!

Published on Jul 24, 2025 7:00 AM IST

HHVM MOvie Ticket Prices

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” ఎన్నో అంచనాలు చివరి నిమిషంలో సెట్ చేసుకొని విడుదలకి వచ్చిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ కి సిద్ధం అయ్యింది. దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా పైడ్ ప్రీమియర్స్ తోనే ఊహించని నంబర్స్ ని అందుకుని భారీ రికార్డులు సెట్ చేసింది.

అయితే వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు మొదటి రోజు అందుకునే వసూళ్ల ప్రిడిక్షన్ ఎంత అనేది ఇప్పుడు తెలుస్తోంది. మొత్తం ప్రీమియర్స్ తో కూడా కలిపి ఈ సినిమా ఈజీగా 100కోట్ల దగ్గర గ్రాస్ ని వసూలు చేసే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తోంది. వచ్చిన భారీ హైక్ లు అలాగే మేజర్ గా తెలుగు రాష్ట్రాల్లోని ఓపెనింగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది.

ఓవర్సీస్ లో కొంచెం పర్వాలేదు కానీ పవన్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా వీరమల్లు భారీ ఓపెనింగ్స్ ని సాధించే ఛాన్స్ ఉంది. దాదాపుగా మేకర్స్ నుంచి అఫీషియల్ నెంబర్ బయటకి రాదు కానీ పి ఆర్ లెక్కలు ఏం చెబుతాయో చూడాల్సిందే.

తాజా వార్తలు