ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” అని చెప్పాలి. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. అయితే దీనికి ముందు మేకర్స్ ఓ ప్రెస్ మీట్ ని అది కూడా పవన్ ప్రెజెన్స్ తో ప్లాన్ చేయడం అనేది మంచి సర్ప్రైజ్ గా మారింది.
అయితే నేడు జరగనున్న ప్రెస్ మీట్ లో పవన్ సినిమా కోసం ఎలాంటి విశేషాలు పంచుకుంటారు. ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేది మంచి ఆసక్తిగా మారింది. చాలా కాలం తర్వాత పవన్ స్వయంగా పాల్గొంటున్న సినిమా ప్రెస్ మీట్ కావడంతో అభిమానుల్లో ఈ ప్రెస్ మీట్ మరింత స్పెషల్ గా నిలిచింది. సో పవన్ రియాక్షన్ పట్ల కూడా అంతే కుతూహలం అందరిలో నెలకొంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.