‘హరిహర వీరమల్లు’ ఫైనల్ రన్ టైం.. పూర్తిగా వీర తాండవం

‘హరిహర వీరమల్లు’ ఫైనల్ రన్ టైం.. పూర్తిగా వీర తాండవం

Published on Jul 15, 2025 11:08 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ హిస్టారికల్ చిత్రమే “హరిహర వీరమల్లు”. దర్శకులు క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణలు తెరకెక్కించిన హై బడ్జెట్ పీరియాడిక్ సినిమా ఫైనల్ గా రిలీజ్ కి వస్తుంది. అయితే ఈ గ్యాప్ లో ఇంకా ప్రమోషన్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా కనిపించడం లేదు. ఇంకా ట్రైలర్ కి ముందే గట్టి ప్రమోషన్స్ కనిపించాయి.

అయితే హరిహర వీరమల్లు రీసెంట్ గానే సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాల నిడివితో రాబోతుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇప్పుడు టైటిల్ కార్డ్స్, క్రెడిట్స్ మినహాయిస్తే మొత్తం 2 గంటల 32 నిమిషాల కంప్లీట్ వీరమల్లు తాండవమే ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఇపుడు బిగ్ ట్రీట్ ఈ జూలై 24న ఉండబోతుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు