జగపతిబాబు చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ మూవీ టీజర్ లాంఛ్

జగపతిబాబు చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ మూవీ టీజర్ లాంఛ్

Published on Jul 9, 2025 7:30 AM IST

నటీనటులు లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “రాజు గాని సవాల్”. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “రాజు గాని సవాల్” సినిమా టీజర్ ను టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు.

అనంతరం ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..”ఇది నాకు ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. బాపిరాజు గారు నాకు చాలా దగ్గరి వ్యక్తి. ఆయన ఏదైనా సినిమా తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. “రాజు గాని సవాల్” సినిమాను ఆయన తీసుకున్నారంటే ఇది తప్పకుండా బాగుంటుంది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను మన ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా” అన్నారు.

అతిథిగా వచ్చిన నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ.. “రాజు గాని సవాల్” సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది పెద్ద విజయాన్ని సాధించాలి. హీరో లెలిజాల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా బాపిరాజు..ఇలా అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని “రాజు గాని సవాల్” సినిమా ప్రేక్షకులకు సవాల్ విసరాలి”. అన్నారు.

ఇక నటుడు రవీందర్ బొమ్మకంటి మాట్లాడుతూ..”ముందుగా మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన జగపతిబాబు గారికి థ్యాంక్స్. కంబాలపల్లి కథలు మెయిల్ చిత్రంతో ఆరేళ్ల క్రితం ఇండస్ట్రీకి పరిచయమయ్యా. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ తో గుర్తింపు వచ్చింది. అలిపిరికి అల్లంత దూరంలో భామాకలాపం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాల్లో నటించాను. అయితే “రాజు గాని సవాల్” చిత్రంలో నేను ఎదురుచూస్తున్న క్యారెక్టర్ దక్కింది. నెగిటివ్ షేడ్స్ లో బాగా పర్ ఫార్మ్ చేస్తానని నమ్మకం ఉంది. అలాంటి టైమ్ లో ఈ సినిమాలో నటించే అవకాశం దొరకడం సంతోషంగా ఉంది. ఈ క్యారెక్టర్ కు న్యాయం చేశాననే భావిస్తున్నా. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.

నటి పద్మ మాట్లాడుతూ..”మా టీమ్ అందరి తరుపున మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన జగపతిబాబు గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. “రాజు గాని సవాల్” సినిమాలో నేను హీరోకు అక్క క్యారెక్టర్ లో నటించాను. తెలంగాణ నేపథ్యంలో ఇటీవల సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ మూవీస్ లో మహిళలు జరుపుకునే పండుగలు అంటే బతుకమ్మ, బోనాలనే చూపిస్తున్నారు. అయితే మా సినిమాలో తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే ఒక పండుగను పాట రూపంలో తెరకెక్కించారు. “రాజు గాని సవాల్” సినిమా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఆకట్టుకుంటుంది” అన్నారు.

అలాగే ప్రొడ్యూసర్ తరుణిక మాట్లాడుతూ..”రాజు గాని సవాల్” సినిమా కోసం మూవీ టీమ్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో పాటు మనసుకు హత్తుకునే సెంటిమెంట్ తో ఉంటుంది. “రాజు గాని సవాల్” సినిమా సక్సెస్ పై నమ్మకం ఉంది. ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన జగపతిబాబు గారికి థ్యాంక్స్” అన్నారు.

హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ..”మా సినిమాను సపోర్ట్ చేస్తూ మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన జగపతిబాబు గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. “రాజు గాని సవాల్” సినిమా నేటివ్ ఎలిమెంట్స్ తో పక్కా లోకల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. “రాజు గాని సవాల్” సినిమా సక్సెస్ అవుతుందని మేమంతా ఆశిస్తున్నాం” అన్నారు.

హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. “రాజు గాని సవాల్” టీజర్ ను రిలీజ్ చేసిన జగపతి బాబు గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూవీ హైదరాబాద్ కల్చర్ ను చూపిస్తూ, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్ ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఇక్కడ బ్రదర్ సిస్టర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి, స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. హైదరాబాద్ లో జరిగే కల్చరల్ ఈవెంట్స్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది సహజంగా తెరకెక్కించేందుకు లోయర్ ట్యాంక్ బండ్ లోని కవాడిగూడలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ మూవీ ఇది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది. రియల్ ఫీల్ కలిగేలా కొత్త వాళ్లతో పాటు పేరున్న మా మూవీకి ఆర్టిస్టులను తీసుకున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న బాపిరాజు గారు మా సినిమాను చూసి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాం. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ..”జగపతి బాబు గారు ఎంతో బిజీగా ఉన్నా, మా మీద ప్రేమతో “రాజు గాని సవాల్” టీజర్ లాంఛ్ చేశారు. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో తెలంగాణ నేపథ్యంతో వస్తున్న చిత్రమిది. ఇప్పటిదాకా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. టికెట్ కొనుక్కుని మా మూవీకి వచ్చే ఏ ప్రేక్షకుడినీ మేము నిరాశపర్చము. మంచి లోకల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ తో “రాజు గాని సవాల్” సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సహజంగా పర్ ఫార్మ్ చేశారు. ప్రొడక్షన్ డైరెక్షన్ చేస్తూ హీరోగా నటించడం మామూలు విషయం కాదు. ఈ చిత్రం కోసం లెలిజాల రవీందర్ గారు ఎంతో కష్టపడ్డారు. హీరోగా ఆయన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. “రాజు గాని సవాల్” సినిమాను రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 8న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీ అందరి ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు