‘మోనిక’తో చిందులేస్తున్న కూలీ.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

‘మోనిక’తో చిందులేస్తున్న కూలీ.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

Published on Jul 9, 2025 6:59 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కూడా ఉందని.. అందులో పూజా హెగ్డే నటిస్తుందని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది.

తాజాగా ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మోనిక..’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను జూలై 11న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డే అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. అటు అనిరుధ్ ఈ సాంగ్‌ను క్యాచీ ట్యూన్స్‌తో కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, సౌభిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు