గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా దానిని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు.
అయితే, తాజాగా ఈ సినిమాలో ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో నటించిన ఓ యాక్టర్ నటిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ యాక్టర్ ఎవరా అనే ఆరా తీస్తున్నారు అభిమానులు. కాగా, ‘కల్కి 2898 ఎడి’ సినిమాలో నటించిన శాశ్వత చటర్జీ ‘అఖండ 2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.