మన టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా చేసిన అన్ని సినిమాల్లో బాగా గుర్తుండిపోయిన సినిమా పేరు ‘డీజే టిళ్ళు’. ఒక బాహుబలి, పుష్ప లాంటి ఐకానిక్ పాత్రల్లా టిల్లు గాడు కూడా ఒక బ్రాండ్ ని సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు వరకు మంచి కామికల్ యాంగిల్ ఇంకా రొమాంటిక్ పాత్రలు చేసిన యంగ్ హీరో ఇప్పుడు మాస్ అవతార్ లోకి మారాడు.
తన టిల్లు ప్రొడ్యూసర్స్ తో కలిసి ‘బ్యాడాస్’ అనే సాలిడ్ ప్రాజెక్ట్ ని ఇపుడు అనౌన్స్ చేశారు. తనపై ఒక మాస్ లుక్ ని మేకర్స్ రివీల్ చేయగా ఈ పోస్టర్ లో సిద్ధూ మంచి డైనమిక్ గా కనిపిస్తున్నాడు. మీడియా ముందు స్టైలిష్ గా సిగరెట్ కలుస్తూ తన మార్క్ యాటిట్యూడ్ ని చూపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది మేకర్స్ రిలీజ్ కి లాక్ చేసేసారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.