‘వీరమల్లు’ నుంచి నెక్స్ట్ ట్రీట్ ఇదే!?

‘వీరమల్లు’ నుంచి నెక్స్ట్ ట్రీట్ ఇదే!?

Published on Jul 9, 2025 10:59 AM IST

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ విలన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ లు తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ తర్వాత మిగతా ఇంకొన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.

ఇలా నెక్స్ట్ సినిమా నుంచి ఓ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఆల్బమ్ లో మొత్తం 6 పాటలకి పైగా ఉన్నట్టు చెప్పారు. వీటిలో నాలుగు ఇప్పుడుకే వచ్చాయి. ఇప్పుడు ఐదో సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాణం వహించగా ఈ జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు