బాలయ్యతో వెంకీ మామ మల్టీస్టారర్.. మామూలుగా ఉండదట!

బాలయ్యతో వెంకీ మామ మల్టీస్టారర్.. మామూలుగా ఉండదట!

Published on Jul 7, 2025 11:05 AM IST

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. ఇక పెద్ద హీరోల మల్టీస్టారర్ చిత్రం వస్తుందంటే ఆ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ మల్టీస్టారర్ గురించి టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ త్వరలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వెంకటేష్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో వెల్లడించారు. తాను చేయబోయే సినిమాల జాబితాను వెంకీ ప్రకటించాడు. త్రివిక్రమ్‌తో ఓ సినిమా.. చిరు-అనిల్ మూవీలో ఓ కేమియో రోల్.. మీనాతో కలిసి ‘దృశ్యం-3’.. అనిల్ రావిపూడి తో మరో సినిమా.. ఆ తర్వాత బాలయ్యతో ఓ మల్టీస్టారర్ చిత్రం ఉండబోతుందని వెంకీ అనౌన్స్ చేశాడు.

దీంతో వెంకటేష్ అభిమానులతో పాటు నందమూరి అభిమానుల్లో కూడా ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు