టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ కూడా ఒకటి. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను హారర్ కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా నిర్మాత ఎస్‌కెఎన్ వ్యవహరిస్తున్నారు.
అయితే, నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ యూనిట్ ఆయనతో కేక్ కట్ చేయించారు. రాజా సాబ్ సెట్స్‌లో ఈ మేరకు SKN బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. దర్శకుడు మారుతి ఎస్‌కెఎన్‌తో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ వేడుకల్లో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా పాల్గొంది.
ఇక దీనికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.