ఇండియన్ సినిమాలో అత్యంత ధనికుడైన హీరో ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. నవాబుల వంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో లెక్క సరిగా లేదని తెలుస్తోంది. అయితే, ఆయన తనకున్న అపారమైన సంపదలో ఇప్పుడు ఏకంగా రూ.15 వేల కోట్ల ఆస్తి కోల్పోబోతున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని తమ పూర్వీకుల ఆస్తి సొంతం చేసుకునేందుకు సైఫ్ అలీ ఖాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అక్కడున్న రూ.15 వేల కోట్ల ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించాలని భావిస్తుంది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సైఫ్ అలీ ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా, ఈ పిటీషన్‌ను హై కోర్టు కొట్టివేసింది.
అక్కడున్నది ఎనిమీ ప్రాపర్టీయే అని.. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. దేశ విభజన తర్వాత సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల్లో కొందరు పాకిస్థాన్‌కు వెళ్లిపోయారని.. వారికి సరైన వారసులు లేరనే కారణంగా ఈ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.