ఓజి, ఓజి అన్నారు.. ‘వీరమల్లు’ దెబ్బపై ఏ ఎం రత్నం కామెంట్స్ వైరల్!

ఓజి, ఓజి అన్నారు.. ‘వీరమల్లు’ దెబ్బపై ఏ ఎం రత్నం కామెంట్స్ వైరల్!

Published on Jul 3, 2025 2:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేసిన చిత్రాల్లో దర్శకులు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి ఈ సినిమా నుంచి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న సాలిడ్ కంటెంట్ ఎలా ఉండబోతుంది అనే దానికి మచ్చు తునకగా అదిరే ట్రైలర్ కట్ ని ఇపుడు మేకర్స్ విడుదల చేసాక ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది.

అయితే నిజానికి పవన్ నుంచి మొదటి భారీ పాన్ ఇండియా చిత్రం ఇదే. కానీ దీని తర్వాత ఓజి అనౌన్స్ అయ్యాక దీనికి మించి ఓజికి ఫ్యాన్స్ హంగామా చేశారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ చూసాక వీరమల్లుని డామినేట్ చేసింది అనుకున్న ఓజి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఇదే విషయాన్ని ట్రైలర్ లాంచ్ లో ఏ ఎం రత్నం కూడా ప్రస్తావించారు.

ఇన్ని రోజులు ఓజి ఓజి అన్నారు ఇపుడు వీరమల్లు ట్రైలర్ ఎలా ఉంది అని ఫ్యాన్స్ ని అడగడం వీరమల్లు కోసం చాలా మందికి తెలీదు అసలు సినిమా జూలై 24 ఉంది వెయిట్ చెయ్యండి అంటూ చేసిన కామెంట్స్ ఓజి మేనియాని కూడా పక్కన పెట్టేలా చేసాయి. మొత్తానికి మాత్రం ఇక వీరమల్లు విధ్వంసమే అని చెప్పాలి. జూలై 24 కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు