మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం హిందీ సహా తెలుగు ఆడియెన్స్ కూడా గట్టిగా ఎదురు చూస్తున్నారు.
అయితే హిందీలో హృతిక్ ఫ్యాక్టర్ అయితే తెలుగులో మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ మేనియా ఉందని చెప్పాలి. ఇంకా చాలా సమయం ఉన్న సినిమాకి అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి భారీ డిమాండ్ నెలకొన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఏపీలో చాలా చోట్ల స్పెషల్ షోస్ కోసం ఇపుడు నుంచే థియేటర్స్ యాజమాన్యాలతో అభిమానులు చర్చలు జరుపుతున్నారట.
దీనితో తారక్ మాస్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో హృతిక్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ప్రీతమ్ సంగీతం అందించారు. అలాగే యష్ రాజ్ ఫిలింస్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ ఆగస్ట్ 14న తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.