ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ ‘వార్’ షురూ..!

ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ ‘వార్’ షురూ..!

Published on Jul 1, 2025 9:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే వార్ 2 కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు హీరోస్ ఫ్యాన్స్ కి థియేటర్స్ లో క్రేజీ ట్రీట్ అయితే ఉండబోతుంది. మరి వార్ 2 లో ఇద్దరి హీరోస్ నడుమ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటుగా మాంచి డాన్స్ నుంవేర్నెంబర్ కూడా ఉంటుంది అని తెలిసిందే.

ఇద్దరికిద్దరు డాన్స్ పరంగా ఎలాంటి పెర్ఫార్మర్ లు అనేది ఇండియన్ ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి డైనమైట్స్ నడుమ డాన్స్ నెంబర్ ఎట్టకేలకి ఈరోజు షూట్ తో స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ కొన్ని రోజులు యష్ రాజ్ స్టూడియోస్ లో రిహార్సల్స్ కూడా గట్టిగా జరిగాయి. సో ఫైనల్ గా సెట్స్ లో ఈ ఇద్దరు స్టార్స్ ఈరోజు షురూ చేయనున్నారు. మరి థియేటర్స్ లో ఇదెలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు