గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఊర మాస్ అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్‌ను జూలై 12న ఢిల్లీలో ప్రొరంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రామ్ చరణ్, జాన్వీ లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చిత్రీకరిస్తారు. దీంతో పాటు ఒకట్రెండు పాటలు కూడా ఇక్కడ చిత్రీకరణ జరుపుకోనున్నాయట.
ఈ సినిమాకు సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.