ఇంట్రెస్టింగ్.. నితిన్ ‘తమ్ముడు’కి A సర్టిఫికెట్!

ఇంట్రెస్టింగ్.. నితిన్ ‘తమ్ముడు’కి A సర్టిఫికెట్!

Published on Jun 28, 2025 2:03 PM IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ ప్రముఖ నటి లయ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం వచ్చే వారం రిలీజ్ కి వస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ని అందుకోగా మేకర్స్ ఓ అనౌన్సమెంట్ అయితే ఇచ్చారు. నితిన్ పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపారు.

దీంతో తమ్ముడు చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది ఒకింత ఆశ్చర్యంగా మారింది అని చెప్పాలి. మరి ఎలాంటి కంటెంట్ మేర ఏ సర్టిఫికెట్ వచ్చిందో కానీ తమ్ముడు సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూలై 4న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు