లేటెస్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రమే “కన్నప్ప”. మంచు విష్ణు హీరోగా ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన భారీ చిత్రమే ఇది కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ నటించారు. అయితే మొదటి నుంచీ ఈ స్టార్స్ విషయంలో మంచి అంచనాలు ఉన్నాయి.
ఎవరెవరి పాత్రలు ఎలా ఉంటాయి అనేది మేకర్స్ మరింత కష్టతరంగా మారే టాస్క్ అని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ లో ప్రభాస్ లాంటి స్టార్ ని ఎలా చూపిస్తారు అనేది అంతకు మించిన తలనొప్పి అని చెప్పొచ్చు. దానిని కూడా మేకర్స్ విజయవంతంగా అభిమానుల అంచనాలు రీచ్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేసారని చెప్పవచ్చు.
ప్రభాస్ సినిమాలో ఎంటర్ అయ్యిన దగ్గర నుంచి సినిమా మొత్తం మారిపోయింది. తన ప్రెజెన్స్ అయితే ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పాలి. రుద్ర పాత్రలో ప్రభాస్ మాట తీరు, నడవడిక సెకండాఫ్ మొమెంటంనే మార్చేశాయి. ఇలా మొత్తానికి మాత్రం ప్రభాస్ తన ప్రెజెన్స్ తో కన్నప్పని మరో లెవెల్ కి తీసుకెళ్లిపోయడని చెప్పడంలో సందేహం లేదు.