పిక్ టాక్: ఫ్లైట్ నుంచి డైనమిక్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ!

పిక్ టాక్: ఫ్లైట్ నుంచి డైనమిక్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ!

Published on Jun 22, 2025 3:05 PM IST

టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు సహా రాజకీయాలు కూడా ఏకకాలంలో చూసుకుంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ నుంచి ఏపీలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనగా
ఈ తర్వాత తమిళనాడులో మురుగ భక్తర్గల్ మానాడు కోసం వెళ్లిన పవన్ లుక్ మంచి వైరల్ గా మారింది.

వైట్ అండ్ వైట్ లో పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో బ్యాక్గ్రౌండ్ లో చార్టెడ్ ఫ్లైట్ నుంచి బయటకొస్తే మంచి స్టైలిష్ గా తన మార్క్ స్వాగ్ తో కూడా కనిపించడంలో ఫ్యాన్స్ కే ఒకింత మంచి ఎగ్జైటింగ్ గా మారింది. ఇక ఇవి పక్కన పెడితే పవన్ నుంచి భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు సినిమా జూలై 24 గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు