లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన సాలిడ్ హిట్ చిత్రం “కుబేర”. చాలా కాలం నుంచి థియేటర్స్ కి జనం రావట్లేదు అనే మాటని కుబేర బద్దలుకొట్టి మళ్ళీ థియేటర్స్ కి జనాన్ని పరిగెత్తిస్తుంది. ఇలా ఎట్టకేలకి మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతుండగా ఈ సాలిడ్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది.
అయితే ఇదే చిత్రం ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ నుంచి సహా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పలు భారీ చిత్రాల తరహాలోనే ఒక అంశంలో అమితంగా ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ అయ్యిన చిత్రాలు RRR, పుష్ప 2 అలాగే అనిమల్ లాంటి భారీ చిత్రాలకి 3 గంటలకి పైగా నిడివి ఉంది.
అయినప్పటికీ థియేటర్స్ లో జనాన్ని కూర్చోపెట్టవచ్చు. సరైన సినిమా తీస్తే అది చూసే ఆడియెన్ కి ఎలాంటి ఇబ్బంది కాదు అని ఒకదాని తర్వాత ఒకటి నిరూపించాయి. మరి వీటితో పాటుగా ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో వచ్చిన కుబేర సినిమా కూడా నిలిచింది అని చెప్పవచ్చు.
దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జునలతో కలిసి చేసిన మ్యాజిక్ థియేటర్స్ లో సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది. సో రన్ టైం పరంగా ఎక్కువ ఉన్నా కూడా ఆడియెన్స్ ని కూర్చోబెట్టగలవు అనే సినిమాల జాబితాలో ఇప్పుడు కుబేర కూడా నిలిచింది.