రీ-రిలీజ్‌కు సిద్ధమైన అల్టిమేట్ ఎంటర్‌టైనర్ ‘హనుమాన్ జంక్షన్’

రీ-రిలీజ్‌కు సిద్ధమైన అల్టిమేట్ ఎంటర్‌టైనర్ ‘హనుమాన్ జంక్షన్’

Published on Jun 17, 2025 12:02 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రేక్షకులను అలరించిన చిత్రాలను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయడం.. వాటిని బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం జరుగుతోంది. ఇక రీ-రిలీజ్‌లోనూ కొన్ని సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు ‘ఖలేజా’ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.

ఇక ఇప్పుడు మరో కామెడీ జోనర్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో 2001లో వచ్చిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘హనుమాన్ జంక్షన్’ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బుల్లితెరపై కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హనుమాన్ జంక్షన్ చిత్రాన్ని జూన్ 28న రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ అల్టిమేట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు