ఆ డైరెక్టర్‌తో గ్లోబల్ స్టార్ మూవీ కన్ఫర్మ్.. ఇక రచ్చ రచ్చే!

ఆ డైరెక్టర్‌తో గ్లోబల్ స్టార్ మూవీ కన్ఫర్మ్.. ఇక రచ్చ రచ్చే!

Published on Jun 9, 2025 5:01 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాలను వరుసగా ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఓ స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాల వరసలో త్రివిక్రమ్ మూవీని కూడా లైన్‌లో పెట్టాడటన రామ్ చరణ్.

మరి రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథను రెడీ చేశాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, కంటెంట్ రామ్ చరణ్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు