నేను దెయ్యంలా ఉన్నాను అన్నారు – జానీ లీవర్‌

నేను దెయ్యంలా ఉన్నాను అన్నారు – జానీ లీవర్‌

Published on Jun 8, 2025 11:27 PM IST

బాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్‌ కుమార్తెగా జేమీ లీవర్‌ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యక్తిగతంగానూ తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను ఒకింత నల్లగా ఉంటాను. శరీర రంగు విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. కానీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ‘‘నువ్వు అందహీనంగా ఉన్నావు. దెయ్యంలా ఉన్నావు. ఇండస్ట్రీలో నీకు పని దొరకడం కష్టం’ అంటూ నా మొహం మీదే చెప్పారు.

జేమీ లీవర్‌ ఇంకా మాట్లాడుతూ.. ఎంతోమంది నన్ను ఎన్నో రకాలుగా మాటలన్నారు. చిన్నతనం నుంచి నా రంగు విషయంలో ఇలాంటి మాటలే వింటున్నా. ఓ దశలో జీవితంలో నేను విజయం సాధించాలంటే ముందు తెల్లగా మారాలని అనుకున్నాను. కానీ ఆ బావన తప్పు అని ఆ తర్వాత అర్ధం అయింది. నిజం చెప్పాలంటే ఎంతోమంది ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. శరీర రంగు అనేది మన సమాజంలో ఉన్న సమస్య’’ అని జేమీ లీవర్‌ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు