నేను మణిరత్నం గారికి అభిమానిని. – అమీర్ ఖాన్

నేను మణిరత్నం గారికి అభిమానిని. – అమీర్ ఖాన్

Published on Jun 9, 2025 10:00 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ, అమీర్ ఖాన్ ఏం మాట్లాడాడు అంటే.. ‘సౌత్ లో నాకు మణిరత్నం సినిమాలు అంటే ఎప్పటి నుంచో అభిమానం. నేను మణిరత్నం గారి సినిమాలకు అభిమానిని. చాలా సార్లు ఆయనతో కలిసి పనిచేయాలి అనుకున్నాను. చెన్నై వచ్చినప్పుడల్లా ఆయన్ను కలుస్తుంటాను. ఎన్నో సార్లు మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకున్నాం’ అని అమీర్ తెలిపాడు.

అమీర్ ఇంకా మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి కాంబోలో ‘లజో’ అనే మూవీ కూడా అనుకున్నాం. కానీ, అనుకోని కారణాలతో అది చేయలేకపోయాం. కానీ ఎన్నటికైనా మణిరత్నం గారితో మూవీ చేయాలని ఉంది. అది భవిష్యత్ లో నెరవేరుతుందనే ఆశ నాకుంది. ఆయన మంచి విజనరీ. ఎలాంటి సినిమాలను అయినా చాలా బ్యాలెన్స్ చేయగలరు’ అంటూ అమీర్ ఖాన్ మణిరత్నం గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు