మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రవితేజ కెరీర్‌లో 76వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై మేకర్స్ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా పూజా కార్యక్రమానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 5న ఉదయం 9.02 గంటలకు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.