ఆర్ధిక ఇబ్బందుల్లో ‘హరిహర వీరమల్లు’ నిర్మాత.. 11 కోట్లు ఇచ్చిన పవన్!

ఆర్ధిక ఇబ్బందుల్లో ‘హరిహర వీరమల్లు’ నిర్మాత.. 11 కోట్లు ఇచ్చిన పవన్!

Published on Jun 4, 2025 2:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పరిస్థితి ఏంటో అభిమానులకి కూడా అంతగా అంతుపట్టడం లేదు.

అయితే ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒకోసారి ఒకో ట్విస్ట్ తగులుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యనే మొదలయ్యాయి. కానీ ఇంతలోనే మళ్ళీ వాయిదా రూమర్స్ కమ్ముకున్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం భారీగా ఈ సినిమా కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గానే ప్రమోషన్స్ ని కూడా తానే ముందుండి నడిపించారు.

అయితే సడెన్ గా ఈ నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు అనే వార్త షాకింగ్ గా మారింది. దీనితో పవన్ తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం 11 కోట్లు మళ్ళీ వెనక్కి ఇచ్చి ఆర్ధిక ఇబ్బందులు నుంచి తప్పుకోవడానికి తోడ్పడతాయి అని చెప్పారట. అలాగే సినిమా రిలీజ్ ని ఎలాంటి ప్రెజర్ లేకుండా ముందు రిలీజ్ చేసుకోవాలని సూచించినట్టుగా తెలిపారని ఇపుడు సినీ వర్గాల్లో టాక్. దీనితో ఈ టాక్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు