‘కన్నప్ప’ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదట!

‘కన్నప్ప’ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదట!

Published on Jun 4, 2025 8:00 AM IST

ప్రస్తుతం మంచు వారి హీరో మంచు విష్ణు నుంచి రాబోతున్న భారీ చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ సహా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా కాగా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు. మరి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు కాగా తాను ఈ సినిమాలో సుమారు 30 నిమిషాల మేర కనిపించనున్నట్టుగా టాక్ ఉంది.

అయితే ఈ చిత్రం కోసం ఆల్రెడీ సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ అండ్ టీం చేస్తుండగా మంచు విష్ణు కూడా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ ని చేస్తున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్ లోనే తమ సినిమా రిలీజ్ పై మాత్రం తుది క్లారిటీ ఇచ్చాడు. తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ జూన్ 27నే వస్తుంది అని కన్ఫర్మ్ చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ భారీ ఈవెంట్స్ ని తాను ప్లాన్ చేసుకున్నానని కూడా క్లారిటీ ఇచ్చాడు. సో ఈ అవైటెడ్ సినిమా ఈ జూన్ 27న పాన్ ఇండియా లెవెల్లో ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు