నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ చిత్రమే “అఖండ 2 తాండవం”. తన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న నాలుగో సినిమా అందులోని మొదటి సీక్వెల్ కావడంతో క్రేజీ హైప్ దీనిపై ఉంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుండగా ఈ సినిమా రిలీజ్ ని మేకర్స్ ఈ దసరాకి లాక్ చేశారు.
అయితే ఈ రేస్ లో అఖండ 2 రాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. కానీ ఒక అసలైన క్లారిటీ కోసం మాత్రం ఫ్యాన్స్ చూస్తున్నారు. అయితే ఈ జూన్ లోనే బాలయ్య బర్త్ డే ఉండగా ఆరోజు టీజర్ దాదాపు ఖరారు అయ్యింది. అయితే మేకర్స్ ఆ సాలిడ్ టీజర్ కట్ తోనే సినిమా రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనున్నట్టుగా ఇపుడు సమాచారం. అందులోనే పాత తేదీనా లేక కొత్త తేదీనా అనేది మాత్రం రివీల్ కానుందట. సో అఖండ 2 పై ఆ క్లారిటీ రావాలి అంటే టీజర్ తోనే తేలుతుంది.