గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక బాలయ్య బర్త్ డే కానుకగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సందర్భంగా బాలయ్య ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించి తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అఖండ 2 చిత్ర షూటింగ్ జార్జియాలో జరిగినప్పుడు అక్కడ -4 డిగ్రీల చలి ఉందని.. అందరూ వణికిపోతుంటే, తాను మాత్రం అలానే నిలుచున్నాడని ఆయన తెలిపారు. పాత్రలో నిమగ్నమైన తనకు ఏదీ కనిపించదు.. ఇదంతా శివయ్యే చూసుకుంటాడని బాలకృష్ణ కామెంట్ చేశాడు.
అఘోరా పాత్రలో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము రేపేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.