మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలు చూసే వారిలోని కాకుండా చేసేవారిలో కూడా చిరుకి అనేకమంది అభిమానులు ఉన్నారు. తనను ప్రేరణగా తీసుకొని వచ్చినవారు కూడా అనేకం. మరి ఇలా వచ్చిన వారిలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఒకరు. రీసెంట్ గానే మెగాస్టార్ పై ఉన్న ప్రేమని తన 25 ఏళ్ల ప్రస్తానంతో చెప్పి ఆశ్చర్య పరిచారు.
ఇక శేఖర్ కమ్ముల చూపించిన ప్రేమకి చిరు తన మార్క్ రిప్లై అందించారు. “మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు ‘వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను.” అని తెలిపారు. దీనితో తన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
మై డియర్ శేఖర్, @sekharkammula మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ… pic.twitter.com/8MVKQdiiJ3
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2025