ఓటీటీ సమీక్ష : టూరిస్ట్ ఫ్యామిలీ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ సమీక్ష : టూరిస్ట్ ఫ్యామిలీ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Published on Jun 2, 2025 5:02 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 2, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : జియో హాట్‌స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : శశి కుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, యోగి బాబు, కమలేష్ జగన్ తదితరులు
దర్శకులు : అబిషన్ జివింత్
నిర్మాతలు : యువరాజ్ గణేశన్, నజెరధ్ పసిలియన్
సంగీత దర్శకుడు : సీన్ రోల్డాన్
సినిమాటోగ్రాఫర్ : అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ : భరత్ విక్రమన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తమిళంలో ఇటీవల రిలీజ్ అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అక్కడి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
శ్రీలంకలో నెలకొన్న ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి జనం వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో ధర్మదాస్(శశికుమార్), అతడి భార్య వాసంతి(సిమ్రాన్), ఇద్దరు పిల్లలు నిధుషన్(మిథున్ జై శంకర్) ముల్లి(కమలేష్ జగన్) తమిళనాడులోని రామేశ్వరంలోకి అక్రమంగా ప్రవేశిస్తారు. వారికి బంధువైన ప్రకాష్(యోగి బాబు) సాయం చేస్తాడు. స్థానికంగా ఉండే కేశవ నగర్ కాలనీలో వారు ఓ ఇంట్లో అద్దెకు దిగుతారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ప్రాంతంలో బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. దీనికి శ్రీలంక వాసులే కారణమని తెలుస్తోంది. దీంతో ధర్మదాస్ అండ్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు..? ఇంతకీ వాళ్లు ఎవరు..? పోలీసులు వారి వెనకాల పడతారా..? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రానికి సింప్లిసిటీ పెద్ద బలంగా నిలిచింది. హింస, అశ్లీలం, ఓవర్ డ్రామా వంటి అంశాలు మనకు ఈ సినిమాలో మచ్చుకకు కూడా కనిపించవు. చక్కగా, నిజాయితీగా ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. ఈ సినిమాను ఎవరితోనైనా కలిసి నిర్మొహమాటంగా చూడవచ్చు.

ధర్మదాస్ పాత్రలో శశికుమార్ చక్కగా నటించారు. ఆయన తన అభినయంతో ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. వాసంతి పాత్రలో సిమ్రాన్ కూడా చక్కటి ప్రతిభను కనబరిచింది. తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయింది.

ముల్లి పాత్రలో నటించిన కమలేష్ జగన్ మెరిశాడు. అతడు కనిపించిన ప్రతి సీన్‌లోనూ చక్కగా నటించి ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసుకున్నాడు. యోగి బాబు తనదైన కామెడీతో నవ్వించారు. మిగతా నటీనటులు కూడా ఈ సినిమాలో మంచి పాత్రల్లో మెరిశారు.

ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా వృద్ధురాలు మృతి చెందడం, తండ్రి-కొడుకు మధ్య ఎమోషనల్ సీన్ తదితర అంశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా చాలా దగ్గరగా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథ చాలా సింపుల్ కావడంతో.. హై డ్రామా, ఊహించని ట్విస్టులు ఆశించే వారికి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.

నిధుషన్ పాత్రలో మిథున్ జై శంకర్ నటన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. యోగలక్ష్మి పాత్రలో అతడి రొమాంటిక్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఈ లవ్ ట్రాక్ మరికొంత బెటర్‌గా ఉండి ఉంటే యూత్‌కు కొంతవరకు ఈ సినిమా కనెక్ట్ అయ్యేది.

సమ్రాన్ పాత్ర కూడా ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. ప్రేక్షకుల్లో ఆమె పాత్ర పర్వాలేదనిపించినా పూర్తిగా ఇంప్రెస్ చేసేలా మాత్రం ఉండదు.

సాంకేతిక విభాగం :
కొత్త దర్శకుడు అభిషన్ జివింత్ ఈ సినిమా కథను హ్యాండిల్ చేసిన విధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎమోషనల్ రైటింగ్‌తో అతడు ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దడంలో సక్సె్స్ అయ్యాడు. అరవింద్ విశ్వనాథన్ తన సినిమాటోగ్రఫీ వర్క్‌తో ఈ చిత్రానికి బలం చేకూర్చాడు. సియాన్ రొల్డన్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఎడిటర్ భరత్ విక్రమన్ ఈ చిత్రాన్ని ఎలాంటి ల్యాగ్ సీన్స్ లేకుండా చక్కగా హ్యాండిల్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ నీట్‌గా ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు ఇది డబ్బింగ్ చిత్రం అనే భావన కలగకుండా చేస్తుంది.

తీర్పు :
ఓవరాల్‌గా, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓ చక్కటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సింపుల్ కథ, చక్కటి ఎమోషన్స్, సాలిడ్ పర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని బలమైన ఎమోషన్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి ఓ చక్కటి సినిమా చూడాలనుకునే వారు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రాన్ని తప్పకుండా చూడవచ్చు.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

Click Here English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు