ఓటిటి సమీక్ష: ‘కంఖజురా’ – తెలుగు డబ్ సిరీస్ సోనీ లివ్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘కంఖజురా’ – తెలుగు డబ్ సిరీస్ సోనీ లివ్ లో ప్రసారం

Published on Jun 1, 2025 6:49 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 30, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : సోనీ లివ్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్, త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు మరియు ఇతరులు
దర్శకుడు : చందన్ అరోరా
నిర్మాత : అజయ్ రాయ్
సంగీతం : రాబీ అబ్రహం
సినిమాటోగ్రాఫర్స్ : రాజీవ్ రవి, వినోద్ ఇల్లంపల్లి
ఎడిటింగ్ : వైశాఖ్ రవి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఇండియన్ ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన సిరీస్ చిత్రాల్లో సోనీ లివ్ లో ప్రసారానికి వచ్చిన హిందీ సిరీస్ “కంఖజురా” కూడా ఒకటి. మళయాళ స్టార్ నటుడు రోషన్ నటించిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో కూడా వచ్చింది. మరి ఈ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

జైల్లో 14 ఏళ్ళు గడిపిన తర్వాత అషు (రోషన్ మాథ్యూ) తన అన్న మ్యాక్స్ (మోహిత్ రైనా) దగ్గరకి వస్తాడు. అయితే మ్యాక్స్ అప్పటికే బిజినెస్ లో బాగా సెటిల్ అయ్యినవాడు కాగా జైలు నుంచి వచ్చిన తర్వాత అషు కొంచెం నెమ్మదిగా సైలెంట్ గానే ఉంటాడు. అయితే ఇక్కడ నుంచి తన అన్నయ్య మ్యాక్స్ ప్రపంచంలోకి వెళుతున్న అషు ఏం తెలుసుకున్నాడు? వీరి కలయిక సైకలాజికల్ గా ఎలాంటి పరిణామాలకి దారి తీసింది? అది ఎంత దారుణంగా ఉంటుంది అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో ది బెస్ట్ ఇచ్చిన వారిలో డెఫినెట్ గా లీడ్ నటుడు రోషన్ మాథ్యు కోసమే చెప్పుకోవాలి. తాను ఈ సిరీస్ ని ఒక్కడై దాదాపు నడిపించాడు.ముఖ్యంగా తన పాత్రలో వేరియేషన్స్ ని పలు సీక్వెన్స్ లకి తగ్గట్టుగా మార్చి చూపించడం అనేది మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

అలాగే బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా కూడా మంచి పెర్ఫామెన్స్ ని ఈ సిరీస్ లో అందించారు. ఇది వరకు పలు సిరీస్ లలో తన పెర్ఫామెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది చూపించారు. ఇది తన నుంచి మరో సెటిల్డ్ రోల్ అని చెప్పాలి. ఇక నైనాద్ కామత్ ఇంకా మహేష్ శెట్టిలు కూడా బాగా చేశారు. ‘పంజా’ బ్యూటీ సారాహ్ జేన్ డయాస్, త్రినేత్ర హల్దర్ తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తో సహా మంచి మూమెంటం తో మొదటి రెండు ఎపిసోడ్స్ సాగుతాయి. దీనితో మెల్లగా అంచనాలు పెరుగుతాయి. కానీ ఈ కథనం అక్కడితోనే ఆగిపోయింది. అక్కడ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్స్ డల్ గా సాగాయి. చాలా సీన్స్ తరచూ చూపించినట్టే మళ్ళీ మళ్ళీ ప్రెజెంట్ చేస్తున్నట్టు అనిపించడం బాగా బోర్ అనిపిస్తుంది.

అలాగే కథ బాగానే ఉంది కానీ ఇందులో కనిపించే ప్రధాన పాయింట్స్ నమ్మకం, ద్రోహం, విధేయత లాంటివి ఇంకా బలంగా ప్రెజెంట్ చేయాల్సింది. కానీ ఇందులో ఇవే వీక్ గా సాగదీతగా నడిపించారు. ఇవి కానీ పర్ఫెక్ట్ గా ఉండి ఉంటే ఈ సిరీస్ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా నిలిచి ఉండేది. .

అలాగే కొన్ని సీక్వెన్స్ లలో డిజైన్ చేసిన వాతావరణం చూస్తే అక్కడేదో మంచి ట్విస్ట్ ఉంటుంది అనేలా ఉంటుంది కానీ అది కాస్తా నెమ్మదిగా సాగుతూ ఉండడంతో ఏర్పడ్డ ఇంట్రెస్ట్ కూడా పోయేలా మారుతుంది. అలాగే సిరీస్ కొన్ని పాత్రలని ఇంకా బాగా డెవలప్ చేసి డిజైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీ స్లో నిర్మాణ విలువలు నీట్ గా ఉన్నాయి. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్స్ బాగున్నాయి. ఎడిటింగ్ గా బెటర్ గా చేయాల్సింది. కొంచెం ఫాస్ట్ గా కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.

ఇక ఈ సిరీస్ దర్శకుడు చందన్ అరోరా విషయానికి వస్తే.. తాను మాగ్పై టీవీ సిరీస్ నుంచి అడాప్ట్ చేసుకున్న ఈ సిరీస్ లో మంచి కథ కనిపిస్తుంది. కానీ దానిని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో మాత్రం తాను తడబడ్డారని చెప్పక తప్పదు. స్క్రీన్ ప్లే ని ఇంకా ఫాస్ట్ గా డిజైన్ చేసుకోవాల్సింది. కొన్ని చోట్ల ఓకే కానీ దాదాపు సిరీస్ మాత్రం నెమ్మదిగానే నడిపించారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “కంఖజురా” సిరీస్ లో లీడ్ నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పాయింట్ మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది కానీ కథనం మాత్రం అందుకు తగ్గ రేంజ్ లో కూడా డిజైన్ చేసి ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యి ఉండేది. కానీ ఇది మిస్ ఫైర్ కావడంతో కొన్ని మూమెంట్స్ వరకు మాత్రమే ఈ సిరీస్ ఓకే అనిపిస్తుంది. వీటితో కొంచెం తక్కువ అంచనాలే పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు