అక్కినేని ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్డ్‌జీ కూతురు జైనాబ్‌తో జూన్ 6న ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.
ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున, అమల తమ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు హాజరుకావాల్సిందిగా వారు ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు.
అటు అఖిల్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతుండటంతో అక్కినేని వారి ఇంట సందడి వాతావరణం నెలకొంది.