‘బిగ్ బాస్ 9’ పై క్రేజీ న్యూస్.. హోస్ట్ ఫిక్స్ అయినట్టే..?

‘బిగ్ బాస్ 9’ పై క్రేజీ న్యూస్.. హోస్ట్ ఫిక్స్ అయినట్టే..?

Published on May 18, 2025 9:02 PM IST

తెలుగు ప్రేక్షకులను బుల్లితెరపై అలరించిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ షోకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. మొదటి సీజన్ మొదలుకొని, బిగ్ బాస్ 8 వరకు ఈ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పుడు అందరూ బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. ఈసారి హోస్ట్‌గా ఎవరు కనిపిస్తారు..? అనే ఆసక్తి నెలకొంది.

అయితే, బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ మారుతున్నాడని.. అక్కినేని నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ ఈ సీజన్ హోస్ట్ చేస్తారనే వార్తలు జోరుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు ఈ సీజన్ 9 హోస్ట్‌ను నిర్వాహకులు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హోస్ట్‌గా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు కింగ్ నాగార్జుననే వస్తున్నాడట.

ఈ సీజన్ 9 హోస్టింగ్ కోసం ఆయన కోట్ చేసిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్వాహకులు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 షో సెప్టెంబర్ నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు