‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందా!?

‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతోందా!?

Published on May 16, 2025 10:00 AM IST

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వార్ 2” పట్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మొత్తం కంప్లీట్ అయ్యి అంతా అసలు ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వరకు ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సినిమా నుంచి రాలేదు కానీ నేరుగా టీజర్ నే మేకర్స్ వదులుతారు అని టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే టీజర్ పై బిగ్ అప్డేట్ ఈ కొద్ది సమయంలోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఆ బిగ్ అప్డేట్ ఈ రెండు రోజుల్లోనే ఇవ్వనున్నారట. ఇక దీనితో పాటుగా ఈ మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా టీజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు