న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా ‘హిట్ 3’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ అందించారు.
ఇక ఇప్పుడు నాని తన నెక్స్ట్ ప్రొడక్షన్‌లో లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. కోర్ట్ చిత్ర దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్ ఓ సినిమాను ఓకే చేశాడని.. ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేయబోతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నిజంగా ఈ కాంబో గనక ఫిక్స్ అయితే, వరుసగా సక్సెస్ చిత్రాలను అందించిన ఓ హీరో, నిర్మాత జోడీ మనల్ని మరోసారి తమదైన కథనంతో అలరించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే వీరి కాంబినేషన్‌లో సినిమా రానుందా అనేది వేచి చూడాలి.