యూఎస్ మార్కెట్ లో ‘సింగిల్’ గాడి ర్యాంపేజ్!

యూఎస్ మార్కెట్ లో ‘సింగిల్’ గాడి ర్యాంపేజ్!

Published on May 14, 2025 9:00 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మంచి కామెడీ టైమింగ్ తో అదరగొట్టే యువ హీరో శ్రీవిష్ణు కూడా ఒకడు. ఇలా తన కంటెంట్ అండ్ కామెడీతో వరుస సినిమాలు చేస్తున్న తన నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే “సింగిల్”. కేతిక శర్మ అలాగే ఇవానా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు.

మరి ఈ సినిమా రిలీజ్ అయ్యిన డే 1 నుంచే సాలిడ్ టాక్ ని ఆడియెన్స్ లో అందుకొని శ్రీవిష్ణు కెరీర్లో మరో సాలిడ్ వసూళ్ళు అందుకున్న సినిమాగా నిలిచింది. ఇలా వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా సాలిడ్ వసూళ్లు అందుకోవడం విశేషం. మరి ఇలా సింగిల్ చిత్రం యూఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ వసూళ్లు అందుకుంటుంది. దీనితో అక్కడ సింగిల్ హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకోవడం విశేషం. దీనితో శ్రీవిష్ణు కెరీర్లో మరో సాలిడ్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు