‘ఓజి’ సెట్స్ లోకి ఆంధీ ఆగమనం.. ఊచకోత అప్పటికి పూర్తి!?

‘ఓజి’ సెట్స్ లోకి ఆంధీ ఆగమనం.. ఊచకోత అప్పటికి పూర్తి!?

Published on May 13, 2025 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు చేస్తున్న అన్ని సినిమాల్లో కూడా భారీ హైప్ ఉన్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” సినిమానే అని చెప్పాలి. దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఈ చిత్రానికి ఎనలేని హైప్ అనౌన్స్ చేసిన రోజు నుంచీ నెలకొంది. సోషల్ మీడియాలో కూడా మేకర్స్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సెన్సేషన్ గానే మారుతుంది.

మరి ఇలా చాలా కాలం తర్వాత మేకర్స్ షూటింగ్ ని పునః ప్రారంభం చేయగా ఇపుడు ఫైనల్ గా ఆంధీ సెట్స్ లో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నం అయినట్టుగా తెలుస్తుంది. రేపు మే 14 నుంచి హైదరాబాద్ లో పవర్ స్టార్ సెట్స్ లో అడుగు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది.

ఇలా తన పోర్షన్ షూటింగ్ మొత్తాన్ని ఈ జూన్ 10 నాటికి కంప్లీట్ చేసేయాలని షెడ్యూల్ ప్లానింగ్ అట. మొత్తానికి మాత్రం పవర్ తుఫాన్ మళ్ళీ సెట్స్ లోకి రాబోతుండడం ఇపుడు పవన్ అభిమానులు ఎగ్జైట్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు