మన తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు ఈ మే నెలలోనే పలు చిత్రాలు రీరిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి అలా వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి” కూడా ఒకటి. దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ విజువల్ ఫీస్ట్ ఇపుడు థియేటర్స్ లో మరోసారి అదిరే రెస్పాన్స్ అందుకుంటుంది.
సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా రీరిలీజ్ సెలబ్రేషన్ వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఈ చిత్రానికి గట్టిగానే నమోదు అయ్యాయి. మొత్తానికి మాత్రం మంచి రెస్పాన్స్ తో పాటుగా మంచి వసూళ్లు కూడా ఈ చిత్రం అందుకునే ఛాన్స్ ఉంది. మరి తెలుగు ఆడియెన్స్ ఈ చిత్రానికి ఎలాంటి వసూళ్లు అందిస్తారో చూడాలి.
Packed houses… cheering crowds…????✨
Early morning shows of #JVAS witnessed houseful magic all over.The timeless epic receives a grand re-welcome from audiences…????#JagadekaVeeruduAthilokaSundari IN CINEMAS FROM TODAY, in 2D & 3D. @KChiruTweets @Ragavendraraoba #Sridevi… pic.twitter.com/NBDRRf3kC3
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 9, 2025