మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి వాటిని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘విశ్వంభర’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన మెగాస్టారు, తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ తన నెక్స్ట్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ చిత్ర షూటింగ్‌ను కూడా త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామను తీసుకొచ్చేందుకు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట.
తొలుత బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని శ్రీకాంత్ ప్లాన్ చేశాడట. అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం దీపిక పదుకొనె పేరు వినిపిస్తోంది. ‘కల్కి’ మూవీలో నటించిన దీపిక టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మరి చిరంజీవి కోసం దీపిక ఈ సినిమాను ఓకే చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.