మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్ లలో దర్శకుడు సుకుమార్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ కూడా ఒకటి. సినిమా సహా మ్యూజిక్ పరంగా వీరికి సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. మరి వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రమే “ఆర్య”. ఈ చిత్రం వచ్చి నేటికి సరిగ్గా 21 ఏళ్ళు పూర్తయ్యింది. దీనితో మళ్ళీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు.
అప్పట్లో సినిమా సెట్స్ లో తీసుకున్న కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఇందులో యంగ్ లుక్ లో కనిపిస్తున్న దర్శకుడు సుకుమార్ అలాగే నిర్మాత దిల్ రాజులు కనిపిస్తున్నారు. మరి అప్పటి ఆర్య ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం రికార్డులు సెట్ చేసిన పుష్ప రాజ్ గా మారిన ఈ క్రేజీ కాంబినేషన్ తాలూకా ఈ పిక్ అభిమానుల్లో వైరల్ గా మారింది. మరి వీరి కలయికలో మళ్ళీ డైరెక్ట్ గా పుష్ప పార్ట్ 3 ది ర్యాంపేజ్ నే తరువాత రానుంది.