ఓటిటి సమీక్ష: ‘బ్రొమాన్స్’ – మలయాళ డబ్ చిత్రం సోనీ లివ్ లో

ఓటిటి సమీక్ష: ‘బ్రొమాన్స్’ – మలయాళ డబ్ చిత్రం సోనీ లివ్ లో

Published on May 2, 2025 8:54 PM IST

Bromance

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 30, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శ్యామ్ మోహన్, మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమ నంబియార్, సంగీత్ ప్రతాప్ తదితరులు.
దర్శకుడు : అరుణ్ డి జోస్
నిర్మాతలు : ఆషిక్ ఉస్మాన్
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్
కూర్పు : చమన్ చాకో

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మలయాళ హిట్ చిత్రం ‘బ్రొమాన్స్’ కూడా ఒకటి. మరి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని సోని లివ్ వారు ప్రసారంకి తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

షింటో (శ్యామ్ మోహన్) అలాగే బింటో (మాథ్యూ థామస్) ఇద్దరూ అన్నాతమ్ములు కాగా వీరిలో బింటో మొబైల్ కి ఎక్కువగా అలవాటు పడ్డ షార్ట్ టెంపర్ కుర్రాడిగా కనిపిస్తాడు. అయితే ఓ రోజు షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) ద్వారా షింటో కనిపించకుండా పోయాడు అని బింటో తెలుసుకుంటాడు. మరి తన సోదరుడు ఎలా కనిపించకుండా పోయాడు? దీని వెనుక ఉన్నది ఎవరు? బింటో తన సోదరుణ్ణి కనుక్కోడానికి చేసిన ప్లానింగ్స్, నిర్ణయాలు ఏంటి? చివరికి ఆ సస్పెన్స్ ని తాను ఛేదించగలిగాడా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మాథ్యు థామస్ మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచాడు అని చెప్పవచ్చు. ఒక యంగ్స్టర్ గా మొబైల్ కి అడిక్ట్ అయ్యిన కుర్రాడిగా అలాగే తన అన్న పట్ల మంచి ఎమోషన్స్ ని చూపించడంలో తాను మంచి షేడ్స్ ని చూపించాడు అని చెప్పాలి. అలాగే తనపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెడి సీన్స్ కూడా సినిమాలో బాగున్నాయి.

అలాగే సంగీత్ ప్రతాప్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని ఈ చిత్రంలో అందించాడు. అలాగే తనపై వచ్చిన చాలా వరకు సీన్స్ మంచి ఎంటర్టైనింగ్ గా సాగాయని చెప్పాలి. ఇక వీరితో పాటుగా మహిమా నంబియార్ ఇంకా కళాభవన్ షాజన్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు అలాగే కథనంలో చాలా వరకు వీరిపై సాగే కామెడీ సీన్స్ ఇంకా కొన్ని సస్పెన్స్ థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మేజర్ మైనస్ ఏదన్నా ఉంది అంటే అది కథే అని చెప్పాలి. కాన్సెప్ట్ లో సరైన డెప్త్ పెద్దగా కనిపించదు. దీనికి అనుగుణంగా కథనం అయినా మంచి ఇంట్రెస్ట్ గా సాగుతుందా అంటే అది కూడా ఈ సినిమాలో లేదు. వీటితో పాటుగా కామెడీ కొన్ని చోట్ల ఓకే కానీ ఇంకొన్ని చోట్ల మాత్రం బాగా ఫోర్స్డ్ గా కూడా అనిపిస్తుంది.

అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అంత ఇంపాక్ట్ చూపించదు. ఒక ఇంట్రెస్టింగ్ నోట్ తో మొదలైన సినిమా ఇంకా పికప్ అవుతుంది అనుకునే సమయంలో కథనం అంతా మరోలా మారి పేలవంగా అనిపిస్తుంది. మెయిన్ గా సస్పెన్స్ అందులో హ్యూమర్ ని యాడ్ చేసే ప్రయత్నం దర్శకుని నుంచి అంత బాలెన్సుడ్ గా అనిపించదు.

ఇక వీటితో పాటుగా కథనంలో పరిచయం అయ్యే ఎక్కువ పాత్రలు ఒకింత బోర్ గా కూడా అనిపిస్తాయి. ఇక కథనం ఒకసారి బెంగళూరు షిఫ్ట్ అయ్యాక ఇంట్రెస్ట్ మరింత తగ్గిపోతుంది. అలాగే శ్యామ్ మోహన్ ఇంకా కళాభవన్ తదితరులు ఇంకా బెటర్ గా చేయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. గోవింద్ వసంత సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది అలాగే ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు అరుణ్ డి జోస్ విషయానికి వస్తే.. తాను ఒక బ్యాలెన్సింగ్ కామెడీ అడ్వెంచర్ థ్రిల్లర్ ని ప్లాన్ చేసుకున్నారు కానీ ఇందులో ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సింది. చాలా సీన్స్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. వీటిని బెటర్ గా ట్రై చేయకపోవడం మూలాన సినిమా డల్ గా మారిపోయింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లైతే ఈ ‘బ్రొమాన్స్’ కేవలం ఒక యావరేజ్ గా సాగే కామెడీ అడ్వెంచర్ డ్రామా అని చెప్పవచ్చు. మెయిన్ గా నటులు సంగీత్ ప్రతాప్ అలాగే మాథ్యూ థామస్ లు పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. వీరే కొంచెం ఈ చిత్రంలో హైలైట్ అని చెప్పచ్చు. అయితే కథనం ఇంకా బలంగా ఉండాల్సింది. సో వీటితో ఓటిటిలో మరో చిత్రాన్ని ఏమన్నా ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For english Review 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు