మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా MBBS’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శర్వానంద్ సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మొదటి నుంచి ‘అమ్మ చెప్పింది’, ‘గమ్యం’, ‘ప్రస్థానం’ లాంటి సినిమాలు చేసి విమర్శకుల ప్రశంశలందుకున్నాడు. ఇటీవలే ఓ నేషనల్ డైలీ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ సుమారు 18 సినిమాల్లో నటించిన తర్వాత సోలో హీరోగా ‘ఏమిటో ఈ మాయ’ సినిమా చేస్తున్నాను. నా 20వ సినిమా రామ్ గోపాల్ వర్మ ‘సత్య 2′. ఈ సినిమాతో మొదటి సారి టైటిల్ పాత్ర చుట్టూ తిరిగే రోల్ చేస్తున్నానని’ అన్నాడు.
ఇప్పటి వరకూ శర్వా చేసినవన్నీ పాత్రలే, అలాగే కమర్షియల్ సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఇటీవలే వచ్చిన ‘కో అంటే కోటి’ సినిమాలో కూడా శ్రీ హరితో కలిసి తెర పంచుకున్నాడు. ‘నేను దర్శకులు, ప్రేక్షకులు ప్రేమించే పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను కథనే చాలా కీలకమైనదిగా ఎంచుకుంటానని’ అన్నాడు. ప్రస్తుతం శర్వానంద్ సత్య 2 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. క్రిమినల్ మైండ్ కలిగి అండర్ వరల్డ్ కి డాన్ అవ్వాలనుకునే పాత్రలో శర్వా కనిపించనున్నాడు.