ఆగష్టు ని టార్గెట్ చేసిన కమల్ హాసన్

ఆగష్టు ని టార్గెట్ చేసిన కమల్ హాసన్

Published on May 30, 2013 8:20 AM IST

Vishwaroopam

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వరూపం 2’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతోంది. బ్యాంకాక్ ఎయిర్ బేస్ లో నిన్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేసారు. ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై సూపర్ హిట్ అయిన ‘విశ్వరూపం’ సినిమాకి సీక్వెల్. కమల్ హాసన్ ఈ సినిమాని ఆగష్టు లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ప్రొడక్షన్ టీం కూడా అనుకున్న టైం కి పూర్తవుతుందని ఎంతో నమ్మకంతో ఉన్నారు.

‘విశ్వరూపం’ సినిమా మొత్తం ఆఫ్ఘనిస్తాన్, అమెరికా చుట్టూ తిరుగుతుంది. ‘విశ్వరూపం 2’ మాత్రం ఇండియా చుట్టూ తిరుగుతుంది. అత్యాధునిక హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజా వార్తలు