నాపై పూరికి ఉన్న ప్రేమను చూడాలంటే మీరు ‘ఇద్దరమ్మాయిలతో’ చూడాలి

నాపై పూరికి ఉన్న ప్రేమను చూడాలంటే మీరు ‘ఇద్దరమ్మాయిలతో’ చూడాలి

Published on May 30, 2013 3:57 AM IST

Allu-Arjun
ఈ రోజు రాడిస్సన్ హోటల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా హెక్సా ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్, పూరి జగన్, దిల్ రాజు, బండ్ల గణేష్, కేథరీన్, బి.వి.ఎస్ రవి తదితర బృందం హాజరయ్యారు.

ఈ వేడుకలో బన్నీ మాట్లాడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాదిస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. “పూరి నన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమా చెప్తుంది. పనిచెయ్యడం నిజంగా ఆనందకకరం”అని తెలిపాడు.

బండ్ల గణేష్ నిరాడంబరతను కుడా మెచ్చుకున్న బన్నీ “ఈ సినిమా రంగంలో అందరికీ ఉండే 24 శాఖలు గురించే తెలుసు. కానీ 25వ శాఖ కుడా వుంది. అదే నిరాడంబరత. బండ్ల గణేష్ ఎంతో చాకచక్యంగా ఎవరి దగ్గర నుండి ఎంత పని రాబట్టాలో అంతా రాబట్టాడని” తెలిపాడు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్దంగావుంది.

తాజా వార్తలు