సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 31న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్, సినిమా ప్రేమికుల్లో ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టనున్నారా అనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. మేము విన్న సమాచారం ప్రకారం ఉన్న టైటిల్స్ లో నుంచి ఫైనల్ టైటిల్ కోసం మూడు టైటిల్స్ ఖరారు చేసారు. ఫైనల్ టైటిల్ ని త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారని ఆశిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ మహేష్ బాబుకి ఆడియన్స్ లో ఉన్న ఫాలోయింగ్, అతని స్టార్డంని ప్రతిబింబించేలా ఉంటుందని సమాచారం.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబందించిన వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. మాకు తెలిసిన వెంటనే మేము మీకు అందిస్తాము. కావున 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.